డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రాజకీయ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడానికి మరో 12 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. పవన్ తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ఈ స్థలంలో ఆయన ఇల్లు, క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించే యోచనలో ఉన్నారు. ఎన్నికల ముందు పిఠాపురంలోనే నివాసం ఏర్పరచుకోవాలన్న తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంతకుముందే పవన్ భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు, ఈ స్థలాల్లో కూడా ఆయన ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం. ఈ స్థలాల కొనుగోలుతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరించడం, ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ముందుకు వెళ్ళడమనే సంకేతాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.