తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.15-20, క్వార్టర్పై బ్రాండు బట్టి రూ.10 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉంది. సగటున 20-25శాతం వరకు ధరలు పెంచి, నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో మద్యం అమ్మకాలు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యం విక్రయాలపై అధిక పన్నులను విధించడం ద్వారా ఆదాయం పొందుతుంది/ ఇది రాష్ట్రానికి ఎంతో అవసరమైన ఆదాయ వనరుగా మారింది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, సెలవు దినాలలో మద్యం అమ్మకాలు మరింత గా ఉంటాయి. అయితే, అధిక మద్యం వినియోగం సంబంధిత సమస్యలకు దారితీస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.