తెలంగాణలో మొదలైన కులగణన

తెలంగాణ లో ఈరోజు కులగణన సర్వే మొదలైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కుటుంబ సర్వేలో 75 ప్రశ్నలను అడగనున్నారు. అయితే సర్వేలో భాగంగా కుటుంబ ఫొటోలు ఏమీ తీయరు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. ఇంట్లో అందరూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ యజమాని వివరాలు చెబితే సరిపోతుంది. కుటుంబీకుల్లో ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రజాప్రతినిధులు వారి ప్రస్తుత, పూర్వపు పదవీ వివరాలు చెప్పాలి. సమాచారం గోప్యంగా ఉంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?越?. Profitresolution daily passive income with automated apps. Embrace eco friendly travel with the 2025 east to west blackthorn 26rd.