ఆషు రెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎలాంటి లుక్‌లో కనిపించినా, ప్రేక్షకులను ఆకట్టుకునే తనకంటూ ప్రత్యేక శైలి ఉంది. నటిగా కెరీర్ ప్రారంభించిన ఆషు రెడ్డి, తర్వాత యాంకర్‌గా మారి పలు షోలకు హోస్ట్‌గా చేయడం ద్వారా తన గుర్తింపును మరింతగా పెంచుకుంది. అందం, నటన, వినోదం కలిపి ప్రేక్షకులను అలరిస్తూ, తన ప్రత్యేకతను సుస్పష్టంగా చూపుతోంది.
తన లుక్స్ కారణంగా జూనియర్ సమంత గా పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి, చల్ మోహన రంగా సినిమాలో చిన్న పాత్రలో కనిపించి, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఆమె ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలో నటిస్తోంది, ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి స్పందన అందుకుంది. అంతేకాదు, బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది ఆషు రెడ్డి గురించి చర్చలకు కారణమైన మరొక అంశం, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న ఘటన. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఆమె పాదాలను తాకడం వివాదాస్పదంగా మారి, పెద్ద సంచలనం సృష్టించింది.
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే ఆషు రెడ్డి, తన తాజా ఫొటోషూట్లను, వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవలే ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో గ్రీన్ కలర్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో కనువిందు చేసింది. బోల్డ్ ఫోటో షూట్లతో యువతను తన వైపు తిప్పుకుంటూ, రోజుకో కొత్త శైలిలో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “గ్రాఫిక్స్ మాయ” అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరు ఆమె ఫిజిక్‌కి ఫిదా అవుతున్నారు.