AP state cabinet meeting today

నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈరోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఈ భేటీలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 11 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో .. ఈ కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా ఈ కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల తేదీ ఖరారు అయింది. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటి వరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ఈ నెల ముగియనుంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ బడ్జెట్‌తో పలు బిల్లులను రెండు సభల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Só limitar o tempo de tela usado por crianças não evita prejuízos; entenda – jornal estado de minas. Gruppen foren weflirt. Fotos y vídeos onlyfans archives negocios digitales rentables.