టాలీవుడ్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యంగ్ హీరో నితిన్, జయం సినిమాతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, అతని కెరీర్‌కు నిజమైన మలుపు ఇచ్చిన సినిమా దిల్. ఈ సినిమా ఘన విజయంతో నితిన్ తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత అతను రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో తన కెరీర్లో మరో పెద్ద విజయాన్ని సాధించాడు.
కానీ, సై తర్వాత నితిన్ చేసిన చిత్రాలు వరుసగా ప్లాప్లుగా మిగిలిపోయాయి. ఒక దశలో నితిన్ కెరీర్ ముగిసినట్లేననే భావన కలిగింది. కానీ, అదే సమయంలో వచ్చిన ఇష్క్ చిత్రం అతనికి తిరిగి గౌరవం తీసుకొచ్చింది. 2012లో ఫిబ్రవరి 24న విడుదలైన ఈ చిత్రం శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి మరియు విక్రమ్ గౌడ్ సంయుక్తంగా నిర్మించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్ సరసన నిత్య మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచి నితిన్‌కు కొత్త ఆశలు రేపింది.
ఇక 11 సంవత్సరాల తర్వాత, 2023లో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇష్క్ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేశారు. మంచి స్పందన లభించిన కారణంగా, ఈ నవంబర్ 30న మరోసారి ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మరియు అరవింద్ శంకర్ సంగీతం అందించగా, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డును గెలుచుకుంది. నితిన్ రాబోయే చిత్రం రాబిన్ హుడ్ కూడా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది, ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.