కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేసారు. రియల్ ఎస్టేట్ రంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కేటీఆర్ చేసిన ట్వీట్ చూస్తే.. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు “పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని’ అన్నారు. “తొమ్మిదిన్నర సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికిందని” అన్నారు. గతంలో ఈ రంగం ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడు “నై.. నై” అంటుంది. “కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే రియల్ ఎస్టేట్ రంగం నై.. నై అంటోందని” వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వలన రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ఆదాయానికి “హైడ్రా (HYDRAA) వేటు” వేసిందని , ముందుచూపు లేని ప్రభుత్వ నిర్ణయాలు వాళ్ళ రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బతీసినట్లు విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థికంగా, సామాజికంగా, రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చుపిస్తున్నాయన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ
తొమ్మిదిన్నరేళ్లు రియల్ ఎస్టేట్ రంగం రయ్.. రయ్ మని ఉరికింది..
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై అంటోంది..
కేసీఆర్ పాలనలో రియల్ భూమ్ కొనసాగింది ఎట్ల.. కాంగ్రెస్ పాలనలో ఆగిపోవడం ఎట్ల?
కేవలం పరిపాలన దక్షత లోపం..విజన్ లేని పాలనా… pic.twitter.com/QWGBGRwqEr— KTR (@KTRBRS) November 5, 2024