మార్కో ఇంటెన్స్ యాక్షన్ గా మార్కో టీజర్

stills from marco teaser

హనీఫ్ అదేని దర్శకత్వంలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబోయే చిత్రం ‘మార్కో’ మలయాళ సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగించింది. హింసాత్మకత మరియు తీవ్రతతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కిందని ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా అర్థమవుతోంది, ఇది ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.

అక్టోబర్ 13న విడుదలైన మలయాళ టీజర్ విశేషమైన స్పందన అందుకోగా, హిందీ టీజర్ పైన కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్‌లో కూడా క్రేజ్ తెచ్చేందుకు సోమవారం అనుష్క శెట్టి మార్కో తెలుగు టీజర్‌ను ఆవిష్కరించారు. అనుష్క, ఉన్ని ముకుందన్‌ కలిసి సూపర్ హిట్‌ మూవీ ‘భాగమతి’లో నటించారు. ఈ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడుదల చేస్తూ, అనుష్క ఉన్ని ముకుందన్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మార్కో పాత్రలో ఉన్ని ముకుందన్ చాలా స్టైలిష్‌ గా, భీకరంగా కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ మరియు పతాకాలపై షరీఫ్ ముహమ్మద్, ఉన్ని ముకుందన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా, సిద్దిక్ మరియు జగదీష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. నివిన్ పౌలీ నటించిన ‘మైఖేల్’ చిత్రానికి స్పిన్-ఆఫ్‌ గా రూపొందిన ‘మార్కో’, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్-ఇండియన్‌ రిలీజ్‌ కోసం సన్నద్ధమవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌తో పాటు ఉత్కంఠభరిత అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

ఈ చిత్రం ఈ క్రిస్మస్‌కి విడుదల కానుంది, ఇప్పటికే కేరళలోనే 200 స్క్రీన్‌లలో థియేటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 30 కోట్ల బడ్జెట్‌తో 100 రోజుల పాటు షూటింగ్ చేసిన ‘మార్కో’ నిర్మాణానంతర పనులు పూర్తి అవుతుండటంతో భారీ విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలో విడుదలైన ‘గరుడన్’ సినిమాతో ఉన్ని ముకుందన్ మంచి క్రేజ్ సంపాదించడంతో, ఈ చిత్రంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу. Latest sport news. レコメンド.