Special App for Indiramma Houses . Minister Ponguleti

ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌: ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని తెలిపారు. పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామని అన్నారు. మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈయాప్ ద్వారా ఇళ్ల నిర్మాణం పరిశీలన జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం రూరల్‌లో రూ.71 వేలు , అర్బన్‌లో లక్షా యాబై వేలు రూపాయలు ఇస్తుందని తెలిపారు.

మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదవారి చిరకాల స్వప్నం నెరవేరుస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వారికే స్కీంలు ఇచ్చారని.. వారు ఇంకా అదే భ్రమలో ఉన్నారని విమర్శించారు. గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్షా యాబై వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని అన్నారు. కేవలం 91 వేల ఇళ్లు మాత్రమే కట్టి అందులో మౌలిక వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో 63 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయని.. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Hvordan plejer du din hests tænder ?. House passes johnson’s plan to avert shutdown in bipartisan vote.