సాంకేతిక లోపం..నిలిచినపోయిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు

Technical error..Hyderabad metro trains stopped

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం మెట్రోలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నాగోల్-రాయదుర్గం, ఎల్ బీ నగర్-మియాపూర్ రూట్లలో 30 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీన్ని సరిచేసేందుకు టెక్నికల్ సిబ్బంది రంగంలోకి దిగారని మెట్రో అధికారులు తెలిపారు.

సోమవారం ఉదయం ఆఫీస్ సమయంలో ఈ సమస్య వచ్చింది. ప్రతి రోజూ సుమారు ఐదున్నర లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మెట్రో సేవలపై ఆధారపడే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.మెట్రో సేవలపై ఆధారపడే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

కాగా, 2022 నవంబర్ 22న కూడా ఇదే రీతిలో హైద్రాబాద్ మెట్రో లో సాంకేతిక సమస్య వచ్చి రైళ్లు నిలిచిపోయాయి. లకీడికపూల్ మెట్రో రైల్వే స్టేషన్ లో రైలు నిలిచిపోయింది. మియాపూర్- ఎల్ బీనగర్, మియాపూర్ మార్గాల్లో అరగంటకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి. 2022 మేలో కూడా ఇదే రీతిలో మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో కారిడార్ లో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదే నెల చివర్లో మూసారాంగ్ రైల్వేస్టేషన్ లో టెక్నికల్ సమస్యతో రైలు ఆగింది. 20 నిమిషాలు స్టేషన్ లోనే ప్రయాణీకులు నిలిచిపోయారు. ఫిబ్రవరిలో కూడా టెక్నికల్ సమస్యలు మెట్రో ప్రయాణీకులను ఇబ్బంది పెట్టాయి. మియాపూర్-ఎల్ బీ నగర్ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్ లోనే 20 నిమిషాలకు పైగా రైలు నిలిచిపోయింది.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

拍?. I done for you youtube system earns us commissions. 2025 forest river wildwood 42veranda.