సూర్యకిరణాలు మన చర్మానికి హానికరమైన ప్రభావాలు చూపుతాయి. సూర్యుడి UV కిరణాలు చర్మంపై ప్రభావం చూపించి, సన్‌బర్న్, చర్మ రంగు మార్పులు, ముడతలు వంటి సమస్యలను కలిగిస్తాయి. ఎక్కువ సేపు సూర్యకిరణాల కింద గడిపితే చర్మ కేన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడం చాలా అవసరం.
సూర్యరశ్మి ప్రభావాన్ని తగ్గించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించడం ప్రధాన మార్గం.. బయటకు వెళ్లే ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం మంచిది. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 4 గంటల మధ్య సూర్యకిరణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవడం మంచిది. వెళ్ళాల్సిన పరిస్థితుల్లో పొడవైన చేతుల బట్టలు, టోపీ, మరియు UV రక్షణ గల కళ్లద్దాలు ఉపయోగించడం వల్ల సూర్యకిరణాల ప్రభావం తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజుకు తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా సూర్యరశ్మి వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉండి అందంగా కనిపిస్తుంది.