హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యాదవ్ సోదరులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇకపై సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా జరగపనున్నారు. సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండగ హోదా కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ సదర్ సమ్మేళనాన్ని యాదవ సోదరులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా సదర్ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వాత రెండో రోజు యాదవ కులస్తులు ఈ సదర్ వేడుకలను నిర్వహిస్తారు. జంట నగరాల్లో ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. సిటీలోని ముషీరాబాద్ లో నిర్వహించే పెద్ద సదర్ చాలా ఫేమస్. యాదవుల తమ వద్ద గల దున్నపోతుల్లో బలమైన దున్నపోతులను అందంగా అలంకరించి ఈ పండగలో ప్రదర్శిస్తారు.