ఐపీఎల్-2025 రిటెన్షన్‌లో పలు జట్లు తమ యువ ఆటగాళ్లను నిలుపుకునేందుకు భారీగా పెట్టుబడి పెట్టాయి యువ క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టడంతో కొందరి జీతాలు విపరీతంగా పెరిగాయి. లక్షల జీతాలు ఏకంగా కోట్లకు చేరడంతో ప్రధానంగా ధ్రువ్ జురెల్ మతీషా పతిరణ రజత్ పాటిదార్ మయాంక్ యాదవ్ లాంటి యువ ఆటగాళ్లకు భారీ శాలరీ పెంపులు లభించాయి.
- ధ్రువ్ జురెల్
వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ఈ రిటెన్షన్‌లో విశేష శాలరీ పెంపు వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ ఈ యువ క్రికెటర్‌ను రిటైన్ చేసేందుకు భారీగా రూ. 14 కోట్లు చెల్లించింది, ఇది గత సీజన్‌లోని రూ. 20 లక్షల జీతం నుంచి ఏకంగా 6900 శాతం పెరుగుదలకు సాక్ష్యంగా నిలిచింది. - మతీషా పతిరణ
శ్రీలంక పేసర్ మతీషా పతిరణ చెన్నై సూపర్ కింగ్స్ తరపున డెత్ ఓవర్ల బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబరిచాడు. ఈ యువ బౌలర్‌ను కొనసాగించడానికి సీఎస్‌కే రూ. 13 కోట్లకు రిటైన్ చేయగా, ఇది గత సీజన్‌లోని రూ. 20 లక్షల జీతం నుంచి 6400 శాతం పెరుగుదల. - రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్
రాజ్‌చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రజత్ పాటిదార్‌కు రూ. 11 కోట్ల భారీ జీతం రిటెన్షన్‌లో లభించగా, ఇది గత సీజన్‌లోని రూ. 20 లక్షల జీతంతో పోలిస్తే 5400 శాతం పెరుగుదల మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే శాలరీ పెంపు లభించడంతో అతని జీతం రూ. 11 కోట్లకు చేరింది వీరితో పాటు గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్‌కు రూ. 20 లక్షల నుంచి రూ. 8.50 కోట్లకు, శశాంక్ సింగ్‌కు రూ. 5.50 కోట్లు, అలాగే రింకూ సింగ్‌కు రూ. 55 లక్షల నుంచి రూ. 13 కోట్ల వరకు శాలరీ పెంపు లభించింది.