Liquor prices to increase in Telangana

మందుబాబులకు షాకింగ్ న్యూస్..తెలంగాణలో పెరుగనున్న మద్యం ధరలు..!

హైదరాబాద్‌: తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ శ్రమిస్తోంది. ఏపీలో మద్యం ధరలను సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం. త్వరలో బీరుకు రూ. 20, లిక్కర్‌కు రూ. 20 నుంచి 70 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. ధరలు పెరగడం ద్వారా ప్రతినెలా రూ. 1,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ ఆదాయం రావడం తగ్గుతున్నది. గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని ఆ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదైన కేసులు ఈ విషయం స్పష్టంగా చెబుతున్నాయి. గతేడాది మొదటి 6 నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదు అయ్యాయి. అంటే రెట్టింపు కేసులు నమోదవ్వడంతో పాటు పదివేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా మరియు గుడుంబా తయారీలో నిష్క్రమించేందుకు అబ్కారీ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్ మరియు ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ. 36,000 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ. 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ. 8,040 కోట్లు వచ్చాయి. అందువల్ల, ఇప్పటివరకు ఈ రెండు మార్గాల ద్వారా రూ. 17,533 కోట్లు ఆదాయం వచ్చినట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇదే మొత్తాన్ని సాధించగలమని భావిస్తే, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 35,000 కోట్లను అధిగమించేందుకు అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Hest blå tunge. Arizona voters will decide fate of texas style border law at the ballot box.