ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చాక మొదటగా పెన్షన్ పెంపు అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్‌పై ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు అక్కడ ఐఎస్ జగన్నాథపురం నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ విషయాన్ని ఏపీ మంత్రి మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు దీపం-2 పథకం కింద మొత్తం 1.55 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపచేస్తున్నట్లు ఆయన వివరించారు.
అంతేకాదు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గమనించిన నాదెండ్ల మనోహర్ ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు గ్యాస్ కనెక్షన రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు దీపం పథకం కింద సిలిండర్ బుక్ చేసిన 24 గంటల్లో డెలివరీ చేయాలని లబ్ధిదారుడు చెల్లించిన సొమ్మును 48 గంటల్లో వారి ఖాతాలో తిరిగి జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది దీపం-2 పథకం గురించి మరిన్ని వివరాలు కావాలంటే ‘1967’ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని నాదెండ్ల మనోహర్ సూచించారు ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజల బాగోగుల కోసం తీసుకురావడం ద్వారా ప్రభుత్వ హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తూ ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరింత మద్దతు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.