ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న సమయంలో, తెలంగాణలోని కరీంగనర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జరిగిన ఒక ఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసే క్రమంలో, విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె కూలిపోవడంతో ఆయన కిందపడ్డారు.

ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలు వెంటనే ఎమ్మెల్యేకి సహాయం చేశారు. “నాకు ఏమి కాలేదని” ఎమ్మెల్యే సత్యం చెప్పడంతో, అందరూ కాస్త కుదుటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కొంతమంది నెటిజన్లు “గద్దెను సరిగా కట్టలేదని, చూసుకోవాలి” అని కామెంట్లు చేస్తూ, అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా ఉండాలనే సూచిస్తున్నారు. ఈ సంఘటన, ప్రజలలో ఈవెంట్ల నిర్వహణపై చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ு. 到?. Am stadtrand von potsdam veröffentlichte, hörten viele den namen silke schröder zum ersten mal.