బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఆయన సిర్పూర్ పర్యటన కోసం కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఉన్న సమయంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి, బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలను దొంగిలించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఉన్నందున పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇంట్లో ప్రాముఖ్యమైన పత్రాలు మాత్రమే దొంగలించబడడం, ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ సంఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, తెలంగాణలో దోపిడీ దొంగల పాలన కొనసాగుతుందని, తన ఇంటిలో జరిగిన దొంగతనంపై తెలంగాణ డీజీపీ పూర్తి దర్యాప్తు చేపట్టాలని కోరారు.