TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌గా నియమితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, తన నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత తనకు ఎంతో గౌరవంగా, అలాగే మహత్తరంగా భావిస్తున్నట్లు తెలిపారు. “నేను తిరుమలలో పలు కీలక పనులు చేయాల్సి ఉంది. భక్తులకు మరిన్ని సౌకర్యాలను అందించేందుకు, భక్తుల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తాను,” అని BR నాయుడు తెలిపారు.
టీటీడీ పాలకమండలిలో తెలంగాణ నుంచి ఐదుగురు సబ్యులకు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం లభించింది. అందులో జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎంఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) ముఖ్యంగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా నియమితులయ్యారు.
టీటీడీ బోర్డు సభ్యులు…
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
ఎంఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
జాస్తి పూర్ణ సాంబశివరావు
నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
శ్రీ సదాశివరావు నన్నపనేని
కృష్ణమూర్తి (తమిళనాడు)
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
దర్శన్ ఆర్ఎన్ (కర్ణాటక)
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ (కర్ణాటక)
శాంతారామ్,
పి.రామ్మూర్తి (తమిళనాడు)
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
నరేశ్ కుమార్ (కర్ణాటక)
డా.ఆదిత్ దేశాయ్ (గుజరాత్)
శ్రీసౌరభ్ హెచ్ బోరా (మహారాష్ట్ర).