हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

తౌటోని కుంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు

Sudheer
తౌటోని కుంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు

 

హైడ్రా (హైదరాబాదు ఇన్విరాన్‌మెంట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ) చెరువుల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో, ఔటరరింగురోడ్ దగ్గర ఉన్న నానక్‌రామ్‌గూడ చౌరస్తాలోని తౌటోని కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సందర్శించారు.

తౌటోని కుంట పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిపాలన ప్రాంతాల నుంచి కుంటకు నీరు చేరే మార్గాలను కూడా పరిశీలించారు.

మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్డు యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలవడం వల్ల అక్కడి అపార్టుమెంట్ల సెల్లార్‌లలో నీరు చేరే సమస్య ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను నివారించేందుకు యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వరద నీరు తౌటోని కుంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తద్వారా తౌటోని కుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరధమ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, నివాసాల మధ్య ఉన్న చెరువుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి సారించగా, ముందుగా వాటి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870