ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. మెగా వేలం తేదీ కూడా ఖరారయ్యే దశలో ఉంది, నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ మెగా వేలం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలపై జాతీయ మీడియా కథనాలు ప్రచారం అవుతున్నాయి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈసారి కొత్త కెప్టెన్ రాబోతోన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పునర్‌స్థాపన చెందుతున్న పేరు ఎవరో కాదు, విరాట్ కోహ్లీ అని వార్తలు వస్తున్నాయి గతంలో విరాట్ కోహ్లీ ఆ జట్టుకు 2013 నుంచి 2021 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు అయితే, ఆ సమయంలో కూడా RCB కప్ గెలవలేకపోయింది. 2022లో కెప్టెన్సీ బాధ్యతలను ఫాఫ్ డుప్లెసిస్‌కు అప్పగించారు, కానీ ఆ జట్టుకు విజయాలు పెద్దగా కలగలేదు.
17 ఏళ్లుగా RCB జట్టు ఎన్నో మార్పులు చేసినా, అంతిమ విజయాన్ని అందుకోలేకపోయింది. దశాబ్దకాలంగా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఆటగాళ్లు, అగ్రశ్రేణి కెప్టెన్లు ఈ జట్టులో సేవలు అందించినా కూడా, ఐపీఎల్ కప్పు మాత్రం వారి గ్యాలరీలో చేరలేదు. ఈ పరిస్థితుల్లో, మళ్లీ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యాజమాన్యం భావిస్తోందని సమాచారం ఈ నిర్ణయం రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబడే అవకాశాలున్నాయి. కోహ్లీ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడితే, ఆయన సమర్ధత, అంచనాలు ఎలా ఉండబోతాయో చూడాల్సి ఉంది. అభిమానులు కోహ్లీకి మద్దతు తెలుపుతూ, ఈ సారి ఆర్సీబీ విజయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు.