Headlines
nandamuri taraka ramarao

వెండితెరకు హరికృష్ణ మనవడు పరిచయం

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తన కెరీర్ ప్రారంభంలోనే సీనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానంతోనే ఇండస్ట్రీలోకి ప్రవేశించానని, ఆయన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని వైవీఎస్ తెలిపారు. ఎన్టీఆర్ పేరు మూడక్షరాల తారకమంత్రంగా, తారక రామారావు అను పేరు ఆరడుగుల రూపంలో వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు తన సినిమాల్లో పరిచయం చేసిన హీరోలను అభిమానులు ఆదరించినట్లుగా, ఈ తారక రామారావునీ కూడా అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇది తారక రామారావు కెరీర్‌కు కొత్త అధ్యాయం కావాలని, ఈ సినిమా ద్వారా అతను తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని పొందుతారని ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి అతి ముఖ్యమైన అతిథులు కూడా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

“రామ్ సినీ ప్ర‌పంచంలోకి నీ మొదటి దశకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీవు చేసే ప్ర‌తి ప్రాజెక్టు విజ‌యం సాధించాలి. నీకు అన్నింటా విజయమే ద‌క్కాల‌ని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల‌ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు క‌చ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావ‌న్న నమ్మకం నాకుంది. నీ భ‌విష్య‌త్తు దెదీప్య‌మానంగా వెగిలిపోవాలి మై బాయ్” అని తార‌క్ ట్వీట్ చేశారు.

All the best on the first of many steps Ram. The world of cinema will offer you countless moments to cherish… Wishing you nothing but success! With the Love and blessings of your great grandfather NTR garu, grandfather Harikrishna garu and father Janakiram anna, I’m sure you’ll… pic.twitter.com/Op1jRr6KQ7— Jr NTR (@tarak9999) October 30, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Rg58 coaxial cable 10m + fitted pl259 connectors for cb, scanners & ham radio. Useful reference for domestic helper. While waiting, we invite you to play with font awesome icons on the main domain.