ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మళ్లీ బెదిరింపులకు గురయ్యాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు కోట్లు డిమాండ్ చేస్తూ, లేకపోతే అతన్ని చంపేస్తామనే హెచ్చరికతో మెసేజ్ పంపినట్లు సమాచారం ఈ మెసేజ్ ముంబై ట్రాఫిక్ పోలీసులకు అందిందని తెలుస్తోంది డబ్బులు ఇవ్వకుంటే అతని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆ మెసేజ్‌లో స్పష్టంగా చెప్పారట.
వివరాల్లోకి వెళితే, సల్మాన్ ఖాన్‌కు ఈ బెదిరింపు గతంలో ఎదురైన పరిస్థితులకు సంబంధించినదిగా పోలీసులు భావిస్తున్నారు బెదిరింపు వచ్చిన వెంటనే, ముంబైలోని వొర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సల్మాన్‌ను బెదిరించిన ఈ కేసులో ఆరా తీసిన పోలీసులు, 20 ఏళ్ల నిందితుడు మొహమ్మద్ తయ్యాబ్‌ను అరెస్టు చేశారు ఇతని పేరు గుర్ఫాన్ ఖాన్ అని కూడా పోలీసులు గుర్తించారు.
తదుపరి దర్యాప్తులో, నిందితుడు నోయిడా సెక్టార్ 39 ప్రాంతంలో ఉంటున్నాడని పోలీసులు కనుగొన్నారు బాబా సిద్ధిక్ కుమారుడు జీషాన్ సిద్ధిక్‌తో పాటు సల్మాన్ ఖాన్‌ను బెదిరించినందుకు తయ్యాబ్‌పై మరిన్ని ఆరోపణలు నమోదు చేసినట్లు సమాచారం గతంలో అక్టోబర్ 12న జరిగిన బాబా సిద్ధిక్ హత్య కేసులో ఈ వ్యక్తి సంబంధం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు సల్మాన్ ఖాన్‌కు గతంలోనూ ఇటువంటి బెదిరింపులు వచ్చిన సందర్భాలు లేకపోలేదు ప్రత్యేకంగా క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును ప్రారంభించి, ఈ విషయంలో మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది.