ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనన్న విజయమ్మ?

YS Vijayamma

వైఎస్ జగన్ మరియు షర్మిల మధ్య ఆస్తుల వివాదం తీవ్రంగా మారిన సమయంలో, వారి తల్లి వైఎస్ విజయమ్మ తన మనసులోని బాధను బహిరంగ లేఖ ద్వారా వ్యక్తం చేశారు. ఓ తల్లిగా ఆమె తన ఇద్దరు బిడ్డలు జగన్, షర్మిలను సమానంగా ప్రేమిస్తానని స్పష్టంగా తెలిపారు ఆస్తుల విషయంలో కూడా ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయన్న విషయం నిజమని, ఆ విషయాన్ని మరొకసారి ప్రజలకు ఉద్ఘాటించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన బిడ్డలందరికీ ఆస్తులు సమానంగా పంచాలని ఆజ్ఞాపించినట్లు విజయమ్మ తెలిపారు జగన్ కష్టంతో ఆస్తులు అభివృద్ధి చెందాయన్న విషయాన్ని కూడా ఆమె అంగీకరించారు అన్నింటా కుటుంబ ఆస్తులేనని, వాటిని రక్షించడంలో జగన్ బాధ్యత తీసుకోవడం కూడా వాస్తవమని చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే ముందు జగన్ తనకు ఇచ్చిన మాట గురించి విజయమ్మ వివరించారు “నాన్నా, నీ తర్వాత ఈ లోకంలో షర్మిల మేలు కోరే వారిలో నేను మొదటి వాడినని జగన్ తన తండ్రికి మాట ఇచ్చారు” అని ఆమె చెప్పారు ఈ వాక్యాలు తాను రాసిన “నాలో నాతో వైఎస్ఆర్” పుస్తకంలో కూడా పొందుపరిచానని విజయమ్మ గుర్తుచేశారు రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉన్నప్పటికీ ఆస్తులు పంపకాలు జరగలేదని, ఆ సమయంలో అవి మొత్తం కుటుంబ ఆస్తులేనని చెప్పారు ఆయన మరణం తర్వాత ఆస్తుల పంపకం చేయాల్సి వచ్చింది ఆ సమయంలో కూడా జగన్, షర్మిల కలిసి ఉన్నారని, తరువాత జరిగిన ఆర్థిక పంపకంలో షర్మిలకు రూ. 200 కోట్లు డివిడెండ్‌గా ఇచ్చారని వివరించారు.

విజయమ్మ, 2019లో జగన్ ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు కుటుంబం విడిపోవాలని ప్రతిపాదన చేసారని వెల్లడించారు. “మనం కలిసి ఉన్నా, మన పిల్లలు కలిసి ఉండకపోవచ్చు” అంటూ జగన్, ఆస్తులను విడదీసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా సమక్షంలో ఎంవోయూ (మేమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) రాసుకొని, ఆస్తులను పంచుకున్నారని అన్నారు ఈ ఎంవోయూ ప్రకారం, షర్మిలకు హక్కు ఉన్నందున ఆమెకు ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఇది గిఫ్ట్ కాదని, జగన్ తన బాధ్యతగా ఆస్తులు పంచినట్లు విజయమ్మ స్పష్టం చేశారు.

పాలిటిక్స్‌లో కూడా షర్మిల తన అన్న జగన్ చెప్పిన ప్రకారమే పనిచేసిందని, జగన్ ముఖ్యమంత్రి అవ్వడంలో షర్మిల కృషి ఎంతో ఉందని విజయమ్మ పేర్కొన్నారు ప్రస్తుతం జరుగుతున్న ఈ సంఘటనలు తనకు ఎంతో బాధ కలిగిస్తున్నాయని, తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు “మా కుటుంబం గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఈ ఆస్తుల విషయంపై నేను బహిరంగంగా మాట్లాడకూడదని అనుకున్నా, కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసి సత్యం బయటపెట్టాల్సి వచ్చింది” అని విజయమ్మ చెప్పారు తన పిల్లల గురించి తక్కువగా మాట్లాడవద్దని, ఈ విషయాలు రాష్ట్రానికి కూడా మంచిది కాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “రాజశేఖర్ రెడ్డి గారు బతికుండగా మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నా మనసును మ్రగ్గిస్తున్నాయి” అంటూ విజయమ్మ లేఖ ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *