(Suriya) ఆసక్తికర కామెంట్స్‌ చేశారుటా లీవుడ్‌ హీరోలపై;

surya

ఇంటర్నెట్ డెస్క్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా టాలీవుడ్ అగ్రహీరోలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగువా నవంబర్ 14న విడుదల కానుండగా సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వైజాగ్‌లో భారీ ఈవెంట్‌ను నిర్వహించారు ఈ ఈవెంట్‌లో సూర్యతో పాటు ప్రముఖ నటుడు బాబీ దేవోల్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరై సందడి చేశారు ఈ సందర్భంలో సూర్య తెలుగు హీరోలతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు రామ్ చరణ్ నాకు సోదరుడితో సమానం ఆయనతో అనేక సార్లు మాట్లాడాను నాకు సంబంధించిన సినిమాలు చూసి తరచూ అభినందనలు తెలియజేస్తారు ఆయన కుటుంబంతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించాలనుకుంటున్నాను.

స్కూల్‌లో మహేశ్ బాబు నాకు జూనియర్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన ఎంతో సహజంగా ఉంటుందనేది నా అభిప్రాయం ఎన్టీఆర్ తెలుగు మాట్లాడే విధానం ఎంతో స్పష్టంగా ఉంటుంది ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి మాట స్పష్టంగా చెప్పగలగడం నాకు బాగా నచ్చుతుంది నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అల్లు అరవింద్ కారణం ఆయన ‘గజినీ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు అల్లు అర్జున్ ఎనలేని కృషి చేస్తారు అతడి డ్యాన్స్ ప్రావీణ్యం అమోఘం పుష్ప 2 కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

కంగువా చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను సూర్య షేర్ చేశాడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో పీరియాడికల్ జానర్‌లో ఉంటుంది ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా మొదటి భాగం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ సినిమా 3D ఫార్మాట్‌లో విడుదల కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే పలు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు కంగువా’లో ఇప్పటివరకు చూడని కొత్త కాన్సెప్ట్ ఉంటుందని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Dentist accused of killing wife allegedly wanted fake suicide notes planted. Latest sport news.