బెటాలియన్ కానిస్టేబుళ్లపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. టాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ విధించడం, ఆకస్మికంగా నిబంధనలు సవరించడం వారికి అన్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసుల అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోకుండా, కుటుంబ సభ్యుల ఆందోళనలను గమనించకుండా చర్యలు తీసుకోవడం అనైతికమని పేర్కొన్నారు.
ఈ మేరకు డీజీపీ జితేందర్‌ను సస్పెన్షన్‌ను మానవతా దృక్పథంతో ఉపసంహరించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు కోసం బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.