కళ్ల కింద డార్క్ సర్కిల్స్ సమస్యను అధిగమించేందుకు కొన్ని సహజ చిట్కాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చిట్కాలను వారం రోజుల పాటు పాటిస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి మరియు ముఖం కాంతివంతంగా మారుతుంది.
- ఆల్మండ్ ఆయిల్
ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ ఈ అధికంగా ఉండి, ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు కళ్ల కింద ఆల్మండ్ ఆయిల్‌ని మసాజ్ చేసి రాత్రంతా ఉంచాలి. ఈ చిట్కా చర్మానికి పోషణ అందిస్తుంది, పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది.
- టమోటా రసం
టమోటా రసం కళ్ల కింద ఉన్న ముడతలను తొలగించడానికి సహాయపడుతుంది, నలుపును తగ్గిస్తుంది. టమోటా రసానికి కొద్దిగా నిమ్మరసం కలిపి, ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి 10 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి.
- రోజ్ వాటర్
రోజ్ వాటర్ చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది మరియు తక్షణ ఉపశమనం ఇస్తుంది. బట్టను రోజ్ వాటర్‌లో ముంచి, కళ్లపై ఉంచాలి. దీని వల్ల చర్మం తక్షణ ఉల్లాసం పొందుతుంది మరియు కళ్ల కిందున్న నలుపు తగ్గుతుంది.
4. సరైన నిద్ర మరియు హైడ్రేషన్
నిద్ర, శరీరానికి సరిపడినంత నీటి పరిమాణం తీసుకోవడం ముఖ్యం. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం ద్వారా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
5. దోసకాయ ముక్కలు
చల్లని దోసకాయ ముక్కలను కళ్లపై 10–15 నిమిషాలు ఉంచండి. దోసకాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి చల్లదనాన్ని అందిస్తాయి, అలాగే నలుపును తగ్గించేందుకు సహాయపడతాయి.
- అలోవెర జెల్
పడుకునే ముందు కళ్ల కింద ఆలొవెర జెల్ తేలికగా రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల కళ్ల కింద నలుపు తగ్గుతుంది.
ఈ చిట్కాలను వారం రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే, కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గి చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.