‘C D’ (క్రిమినల్ or డెవిల్) ఆహా మూవీ రివ్యూ

'C D' (క్రిమినల్ or డెవిల్)

‘C.D’ అనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. అదా శర్మ, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కృష్ణ అన్నం దర్శకత్వం వహించారు, గిరిధర్ నిర్మించారు. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఏమిటో చూద్దాం సిటీ పరిధిలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. వీటిని ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి పోలీస్ ఆఫీసర్ ప్రకాశ్ (భరణి శంకర్) రంగంలోకి దిగుతాడు. కిడ్నాపర్ రెడ్ కలర్‌తో “ఐ విల్ కిల్ యూ” అని రాస్తూ, తమ లక్ష్యాలను భయపెడుతుంటాడు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల పోలీసులు తలనొప్పిగా మారతారు.

ఈక్రమంలో సిద్ధూ (విశ్వంత్) అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి అదే సిటీలో నివసిస్తుంటాడు. శ్రీమంతుల కుటుంబానికి చెందిన సిద్ధూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ రోజు తల్లిదండ్రులు ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు, ఇంట్లో ఒంటరిగా ఉన్న సిద్ధూ “డెవిల్” అనే సినిమా సీడీని తెచ్చుకుని చూస్తాడు. ఆ సినిమా చూసే కొద్దీ, అతనికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. సీడీని తిరిగి ఇచ్చినా, అతనికి ఆ ఇంట్లో ఎప్పుడూ అనుమానాస్పదమైన విషయాలు జరుగుతూనే ఉంటాయి దెయ్యం ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిద్ధూ పుస్తకాలు చదివి, పలు ప్రయోగాలు చేస్తాడు. చివరకు అతను ఆ ఇంట్లో దెయ్యం ఉందని భావించి భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటాడు. ఇదే సమయంలో, కిడ్నాప్‌లు జరుగుతున్న న్యూస్ సిద్ధూకి తెలుసుతుంది. ఇంతలో ఎదురింటి అంకుల్-ఆంటీ ఇంటికి వచ్చిన రక్ష (అదా శర్మ) అనే యువతి, సిద్ధూ ఇంటి తలుపు తడుతుంది. ఆమెతో కలిసి ఉన్నప్పుడే, సిద్ధూ ఆమె ప్రవర్తన అతనికి భయాన్ని కలిగిస్తుంది. ఆమె నిజంగా దెయ్యమా? లేక ఇది ఇంకా కొత్త సమస్యకు నాంది మాత్రమేనా? అనేది కథలో కీలకంగా మారుతుంది.

కథ ప్రధానంగా రెండు ప్రధాన పాత్రల చుట్టూ నడుస్తుంది, మరియు ఈ కథలో ఎక్కువ భాగం ఒకే ఇంట్లో జరుగుతుంది. పరిమిత పాత్రలు, పరిమిత ప్రదేశాలు ఉన్నప్పటికీ, కథలో ఉత్కంఠ సరిగా లేకపోవడం వల్ల ప్రేక్షకులని తెరపై ముగ్గు పెట్టడంలో విఫలమవుతుంది అయితే, చివరి 15 నిమిషాల్లో కథలో ఉత్కంఠ ఉలికిపాటుకు గురిచేసే మలుపు ఉంటుందనే భావన కలుగుతుంది. కానీ ఆ వరకు ప్రేక్షకులు కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చూస్తారని అనిపిస్తుంది. ఈ సినిమాలో నేపథ్య సంగీతం, ప్రత్యేకించి ధృవన్ అందించిన మ్యూజిక్, కథా బలానికి కొంతమేర సపోర్ట్ చేస్తుంది. అలాగే సత్య ఎడిటింగ్, సతీష్ ముత్యాల ఫోటోగ్రఫీ కూడా మెరుగ్గా ఉన్నాయనే చెప్పాలి తక్కువ పాత్రలతో, తక్కువ బడ్జెట్ లో రూపొందించిన ఈ సినిమాలు ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండాల్సిన సందర్భంలో, ఆ కంటెంట్‌ లో ఎక్కడైతే లోపం ఉంటుందో, అక్కడ ప్రేక్షకులలో ఆసక్తి తగ్గిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kaliraj. 台?. Ihr dirk bachhausen.