“పద్మశ్రీ అవార్డు” గ్రహీత గుస్సాడీ కనకరాజు మృతి

Gussadi Kanakaraju

ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు శుక్రవారం తన స్వగ్రామం మర్లవాయిలో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కనకరాజు, తుదిశ్వాస విడిచారు.

గోండు కుటుంబంలో పుట్టి, గుస్సాడీ నృత్యాన్ని ఉనికి కొనసాగించడానికి ఎంతో కృషి చేసిన కనకరాజు, ఈ ప్రత్యేక గిరిజన నృత్యాన్ని వేలాది మందికి నేర్పించారు. ఆయన తన కళను జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం ద్వారా గుస్సాడీ నృత్యానికి ప్రాచుర్యం తీసుకువచ్చారు. 2021లో, కళారంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం కనకరాజును పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

కనకరాజు మరణాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. “గుస్సాడీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. గుస్సాడీ నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విలక్షణ కళాకారుడుగా కనకరాజు తన పేరును సుసంపన్నం చేసుకున్నారు” అని ఆమె అన్నారు. అమరుడైన కనకరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest sport news. He had nо іntеrеѕt іn the еxіѕtіng rulеѕ оf thе gаmе. Southeast missouri provost tapped to become indiana state’s next president.