యాదాద్రి ఫోటో షూట్ పై ఎమ్మెల్యే పాడి క్లారిటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో నిర్వహించిన ఫొటో షూట్ రాష్ట్రంలో వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. “యాదగిరి గుట్ట టెంపుల్ బయట ఫొటో షూట్ చేశాము. ఈవో అనుమతి తీసుకున్న తర్వాతే దీన్ని చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ కట్టించిన యాదాద్రి టెంపుల్‌ను ప్రపంచానికి తెలియజేయాలనే మా ఉద్దేశ్యం అన్నారు.

ప్రభుత్వ పెద్దలు ముందు పాలనపై ఫోకస్ చేయాలి..కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటోంది? సీఎం రేవంత్ సహా మంత్రులు అయోమయంలో ఉన్నారు. సీఎం ఢిల్లీ, కేరళ టూర్లలో ఉన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కొరియాకు వెళ్లారు. టూర్‌ల మాదిరిగా, మంత్రి తుమ్మల మలేషియా టూర్ మీదే దృష్టి పెట్టారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాఫ్టర్ కోసం గొడవ పడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమేనా? హామీలు అమలు చేయకపోతే, తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ పైసలు వయనాడ్‌కు హెలికాఫ్టర్‌లో తీసుకువెళ్లి ప్రియాంకా గాంధీకి ఇచ్చి వస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. 酒?. Gefälschte flughafen seiten auf facebook verkaufen kein verlorenes gepäck.