ప్రతి వయసులో సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మరియు అందానికి చాలా ముఖ్యం. వయసుతో మారుతున్న శరీర అవసరాలను బట్టి ప్రతి దశలో అవసరమైన పోషకాలను పొందడం అత్యంత అవసరం.
10-15 ఏళ్ల వయసులో:
ఈ దశలో యువతీ యువకులకి వేగంగా ఎదగడానికి ప్రొటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్, ఆకుకూరలు, తాజా పండ్లు, నట్స్ వంటి పోషక పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అధిక పిండి పదార్థాలు మరియు కొవ్వులు తగ్గించి, ఫ్రూట్ సలాడ్ లేదా డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించాలి.
15-30 ఏళ్ల వయసులో:
ఈ దశ యువతకు కీలకమైనది. ఎందుకంటే చదువు, కెరీర్, వివాహం వంటి అంశాలు ఉంటాయి. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రాముఖ్యం వహిస్తుంది. అధిక కేలరీలు ఉన్న పప్పుధాన్యాలు, నట్స్, ఫిష్ మరియు పండ్లు తీసుకోవాలి. రక్తహీనత నివారించేందుకు పాలు, చికెన్, చేపలు వంటి ఐరన్ పుష్కలమైన ఆహారాలను చేర్చాలి.
30-40 ఏళ్ల వయసులో:
ఈ దశలో వ్యక్తిగత మరియు వృత్తి బాధ్యతలు పెరుగుతాయి. పీచు పదార్థాలు, డైటరీ ఫైబర్, ఖనిజాలు, విటమిన్ A వంటి పోషకాలను తీసుకోవడం అవసరం. గుడ్లు, బీన్స్, పండ్లు, కూరగాయలు, మాంసం మరియు తృణధాన్యాలను పెరిగి ఉన్న మోతాదులో ఉపయోగించాలి.
40-60 ఏళ్ల వయసులో:
ఈ సమయంలో మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమవుతుంది. ఒత్తిడి, అలసట మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ D, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అవసరం. గింజలు, నట్స్ వంటి పోషకాలు తీసుకోవాలి.
60 ఏళ్లు పైబడిన వారికీ:
ఈ దశలో ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా ఉండాలి. అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నివారించడానికి చక్కెర, ఉప్పు తగ్గించి, కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ పుష్కలమైన ఆహారం తీసుకోవాలి.