హైరదాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా సర్కార్ రూ. 358 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరాలు తెలిపారు. శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నాయి. ఈ బోనస్ 42,000 మంది కార్మికులకు అందించబడనుంది. ముందుగా లాభాల వాటంగా కార్మికులకు రూ. 796 కోట్లను సగటున రూ. 1.90 లక్షలు పంపిణీ చేయడం గమనార్హం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి తన ప్రత్యేక శైలిని చూపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం, తెలంగాణలో ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా, సింగరేణి గనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ గనుల ద్వారా విద్యుత్ మరియు బొగ్గు విక్రయం ద్వారా ఆదాయం వస్తుంది. సింగరేణి కాలరీస్ లో పని చేసే కార్మికులు తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నా కూడా కష్టపడుతున్నారు. అలాంటి కార్మికుల కోసం రేవంత్ సర్కార్ దీపావళి ప్రత్యేక బోనస్ అందించింది.