Headlines
samantha prabhas

Prabhas Samantha: సమంతతో నటించనన్న ప్రభాస్.. కారణం ఆ ఒక్క సమస్య.. ఆ మూవీతో కాస్తలో మిస్సయిన జోడీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న అభిమానులకు ఇది ప్రత్యేకమైన రోజు అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియా సందడి చేస్తోంది. అయితే ఈ సందర్భానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది అది ప్రభాస్ మరియు సమంతల మధ్య ఉన్న జోడీ ప్రభాస్, అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార వంటి ఎన్నో టాప్ హీరోయిన్స్‌తో నటించినప్పటికీ సమంతతో మాత్రం ఆయన ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఈ విషయం అనేక మంది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే ఈ విషయంలో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ప్రభాస్ మరియు సమంత మధ్య ఉన్న హైట్ గ్యాప్ ఈ జోడీ నటించకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ప్రభాస్ ఎత్తు దాదాపు 6 అడుగుల 2 అంగుళాలు (186 CM) కాగా సమంత ఎత్తు 5.2 (158 CM) కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ పెద్ద తేడా వల్ల ఇద్దరు కలిసి నటించినప్పుడు జోడీ అంతగా మెరుగ్గా కనిపించదని భావిస్తున్నారు ప్రభాస్ మరియు సమంత జంటగా నటించే అవకాశం ఒకసారి ముందుకు వచ్చినట్లు సమాచారం ఆ సినిమా ‘సాహో’ అని చెప్తున్నారు యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందించగా మొదట సమంతను హీరోయిన్‌గా అనుకోవడానికి ప్రయత్నించారు అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసుకోవడం జరిగిందని తెలిసింది.

అయితే ఈ హైట్ గ్యాప్ వల్ల సినిమాకు ఏ తేడా ఉండదు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి అందుకే ఫ్యాన్స్ ఇంకా ప్రభాస్ మరియు సమంత కలిసి నటించే అవకాశాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం ‘ద రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏ.డి 2’ వంటి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు మరోవైపు సమంత ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ప్రభాస్-సమంత జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    4oz water cooler cones & cone holder. Latest hacking news 2021. I had a wonderful experience in kenya safari.