తిరుమలలో తెలంగాణ MLAల రికమండేషన్ లెటర్ల చెల్లవనడంపై జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో నెట్టాయి. ఆయన, తమ లెటర్లు చెల్లకపోతే చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించకోవడానికి తిరుమతి వచ్చారు.అయితే ఆయన వచ్చిన సమయంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై అనిరుధ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఆంధ్రోళ్లకు మన ఆస్తులు కావాలంట.. మొన్ననే రూ. 15 వేల కోట్లు తీసుకున్నారు. మన ఆస్తులు కావాలి కానీ తిరుమలలో మనకు హక్కు లేదంట” అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయి, తెలంగాణ ప్రజల మధ్య చర్చకు దారితీస్తోంది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంబంధాలు, ప్రత్యేకించి తిరుమల గురించి ఉన్న అసంతృప్తిని ప్రదర్శిస్తున్నాయి. అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దృక్పథంలో పెద్ద చర్చలు, విమర్శలు కలిగించే అవకాశం ఉన్నాయని అనిపిస్తోంది. చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు మాదిరిగా అని చెప్పారని, కానీ ఇక్కడ పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఇక్కడ మాత్రం తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. అంటే సీఎం చంద్రబాబు ఇప్పుడొక కన్నును తీసేసుకుంటారా అని ప్రశ్నించారు.ఏపీ నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు.