ఒట్టావా : రానున్న ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రూడో ప్రభుత్వానికి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వలసదారుల ప్రవేశాన్ని అనూహ్యంగా తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తమ దేశంలో అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ట్రూడో ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రానున్న లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అనుకుంటున్నారు. ఈ విషయమై అక్కడి వార్త పత్రికలు కొన్ని కథనాలు వెలువరించాయి.
కెనడాలో 2004లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే, 2025లో ఈ సంఖ్యను 3,80,000కు తగ్గించాల్సి వచ్చింది. 2027 నాటికి ఈ సంఖ్యను 3,65,000 వరకు కుదించాలని ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల సమయానికి, ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం సర్వేల్లో వెనకంజలో ఉన్నట్లు తేలింది. వలసల కారణంగా నిరుద్యోగం పెరుగుతుండడంతో పాటు, దేశంలో ఇళ్ల కొరత కూడా భారీగా ఉంది.
ఈ నేపథ్యంలో, అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా, విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లపై మరియు వలస కార్మికులకు పని అనుమతులపై మరింత కఠినమైన నియమాలను ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా, వలసదారుల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.