నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యం. ఈ సందర్శనలో, 29న లాస్‌వెగాస్‌లో జరుగనున్న ‘సినర్జీ’ అనే ఐటీ సర్వ్ అలయెన్స్ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, మరియు రాజకీయ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ముఖ్యంగా, మంత్రి లోకేశ్ పాలనలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తున్నారని, డిజిటల్ ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నారని సినర్జీ సంస్థ అభివర్ణించింది.
అమెరికా కాలమానం ప్రకారం లోకేష్ పర్యటన వివరాలు చూస్తే..
25-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ.
పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్‌తో సమావేశం.
26-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)
పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ.
భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ.
ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు.
27-10-2024 (ఆస్టిన్)
ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ.
28-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)
రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ.
29-10-2024 (లాస్‌వెగాస్)
ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు.
ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం.
30-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)
గూగుల్ క్యాంపస్ సందర్శన.
స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ.
ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం
సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ.
31-10-2024 (జార్జియా)
జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.
1-11-2024 (న్యూయార్క్)
న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం.