మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్‌గా తెరకెక్కింది అయితే అసలు కథలో అనేక మార్పులు చేసి కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కానీ వారిని పూర్తిగా ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది మొత్తం రూ. 85 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ 50 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ సిరీస్ పనోరమ స్టూడియోస్ వంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యాయి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీసుకుని విడుదల చేశారు.
సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంపై అంత పెద్ద అంచనాలు లేకపోయినా హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ (మిరపకాయ్) కారణంగా కొద్దిగా ఆసక్తి ఏర్పడింది టీజర్ ట్రైలర్‌లు మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయడమే కాకుండా లాంగ్ హాలీడేస్ కుదరడంతో కాస్త పాజిటివ్ టాక్ కూడా వచ్చింది అందరూ రవితేజ ఈ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ చేస్తారని భావించారు కానీ ఆ అంచనాలు విఫలమయ్యాయి సినిమా ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుండి రూ. 6 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందులో రూ. 2 కోట్లు డైరెక్ట్‌గా ఇచ్చి మిగిలిన రూ. 4 కోట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన తదుపరి ప్రాజెక్ట్ రెమ్యూనరేషన్‌లో తీసుకోవాలని హరీష్ శంకర్ తెలిపారు ఈ నిర్ణయానికి రవితేజతో పాటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
అలాగే హీరో రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ నుండి రూ. 4 కోట్లు తగ్గించి నిర్మాతలకు సహాయపడినట్లు సమాచారం సాధారణంగా రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో కఠినంగా ఉంటారని సినీ వర్గాల్లో పేరుంది అయినప్పటికీ నిర్మాతలకు ఇలాంటి సహాయాన్ని అందించడం సర్వత్రా హర్షణీయంగా ప్రశంసలు పొందింది అయితే ఈ సినిమా కారణంగా నిర్మాతలకు సుమారు రూ. 20 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు పరిశ్రమ వర్గాల నుండి సమాచారం మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించినంత విజయాన్ని సాధించకపోయినా రవితేజ మరియు హరీష్ శంకర్ చేసిన ఈ మంచి నిర్ణయాలు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.