Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants 1

అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత..కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్..!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్‌ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్‌-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Advertisements

గ్రూప్‌-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్‌ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్‌నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Related Posts
హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదం
బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న రమణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు Read more

Google : గూగుల్లో భారీగా కొలువుల కోత
google jobs

ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోత చేపట్టింది. తాజా నిర్ణయం ప్రకారం, వందలాది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు సమాచారం. Read more

ట్రంప్‌, జెలెన్‌స్కీ భేటీలో వాడీవేడి చర్చ
రష్యా విధ్వంసాన్ని ఒక్కసారి చూడండి.. ట్రంప్‌కు జెలెన్‌స్కీ విన్నపం

ఎలాంటి ఒప్పందం లేకుండానే వెళ్లిన జెలెన్‌స్కీ వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ మ‌ధ్య.. వాషింగ్ట‌న్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జ‌రిగిన భేటీ Read more

సుకుమార్‌పై ఐటీ కొరడా
director Sukumar

ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ Read more

×