Chiranjeevi: భార‌తీయ సినిమాపై చిరంజీవి చెరగని ముద్ర.. గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డు పేజీలో మెగాస్టార్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం!

chiranjeevi pranam khareedu

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్థానం కలిగిన నటుడిగా చిరకాలంగా నిలిచిపోయారు ఇటీవల చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే దీనిపై గిన్నీస్ అధికారిక పేజీలో చిరంజీవి ప్రస్థానం గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు ఆయన సినీ ప్రయాణం ప్రభావం సామాజిక సేవలను ప్రశంసిస్తూ ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా అభివర్ణించారు చిరంజీవి తన కెరీర్‌ను 1977లో ప్రారంభించి ప్రాణం ఖరీదు మరియు పునాది రాళ్లు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఆయన నటనలోని స్ఫూర్తి, డ్యాన్స్ నైపుణ్యం కామెడీ టైమింగ్‌తో ఎంతోమందిని ఆకట్టుకున్నారు ఈ ప్రతిభతో మెగాస్టార్ అనే బిరుదు సంపాదించుకున్నారు ఆయనకు తెలుగు సినీ రంగంలో అపార అభిమాన మద్దతు లభించడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నయ్యగా మారిపోయారు.

చిరంజీవి తన నటనకు గుర్తింపుగా మూడు నంది అవార్డులు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు 1988లో రుద్ర వీణ సినిమాకు గాను నర్గీస్ దత్ అవార్డు కూడా అందుకున్నారు 2007లో ఆయన పద్మభూషణ్‌తో సత్కరించబడ్డారు ఇది భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం ఇక 2024లో ఆయనకు మరో గౌరవం పద్మవిభూషణ్ భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది సినిమాల ద్వారా మాత్రమే కాకుండా చిరంజీవి దాతృత్వంలోనూ తనదైన ముద్ర వేశారు 1998లో ఆయన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)ను స్థాపించారు, దీనివల్ల అనేకమంది రక్తదానం నేత్రదానం ద్వారా సహాయం పొందారు. ఇప్పటివరకు ఈ ట్రస్ట్ ఒక మిలియన్ యూనిట్ల రక్తాన్ని సేకరించి వేలమందికి ప్రాణాధారంగా నిలిచింది. అలాగే 10,000 కంటే ఎక్కువ కణిక దానం కార్యక్రమాలను నిర్వహించింది.

అయితే ఆయన సామాజిక సేవ ఇంతటితో ఆగిపోలేదు 2020లో కరోనా మహమ్మారి సమయంలో సినీ పరిశ్రమలో రోజువారీ కార్మికులకు సహాయం చేయడానికి, కరోన క్రైసిస్ ఛారిటీ (CCC)ని స్థాపించి 15,000 మందికి పైగా వారికి ఆర్థిక సాయం అందించారు 2021లో ఆక్సిజన్ కష్టకాలంలో 42 ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు ఈ చర్య అనేకమందికి ప్రాణభద్రత కల్పించింది ఇక సామాజిక అంశాల్లోనూ చిరంజీవి చురుకుగా పాల్గొన్నారు బాలకార్మిక నిర్మూలన ఎయిడ్స్/హెచ్‌ఐవీ అవగాహన పోలియో వ్యాక్సినేషన్ వంటి అనేక కార్యక్రమాలలో పాల్గొని అవగాహన పెంచడంలో ముఖ్యపాత్ర వహించారు ఈ అన్నిరంగాల్లో చిరంజీవి చేసిన సహాయాలు ఆయన సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి సమస్త భారతీయ సినీ రంగంలో చిరంజీవి చేసిన ప్ర‌భావం ఆయన్ను ఒక స్ఫూర్తి ప్రాయుడిగా నిలబెట్టింది గిన్నీస్ రికార్డ్స్ కూడా చిరంజీవి చేసిన అద్భుత కృషిని గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులకు ఆయన స్ఫూర్తినిచ్చిన విధానాన్ని ప్రశంసించింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Former shеffіеld unіtеd dеfеndеr george bаldосk dies aged 31 | ap news. The technical storage or access that is used exclusively for anonymous statistical purposes. Latest sport news.