‘1000 బేబీస్’ (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ

'1000 babies

‘1000 బేబీస్’ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించిన వెబ్ సిరీస్ అనేక ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో ప్రాధాన్యత పొందింది నజీమ్ కోయ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో ప్రముఖ నటులు నీనా గుప్తా రెహమాన్ (రఘు) ప్రధాన పాత్రల్లో కనిపించారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నిన్నటినుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌లుగా ఉంది సారా (నీనా గుప్తా) అనే ఒక మహిళ తన మానసిక స్థితిని కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తుంది. ఆమె కొడుకు బిబిన్ ఆమెను పట్టణం నుంచి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు తన గది గోడలపై సారా ఎప్పటికప్పుడు ఏదో అడ్రెస్స్‌లు రాస్తూ ఉంటుంది తనకు మార్కర్ పెన్ అందుబాటులో లేకపోతే తీవ్రంగా చిరాకు పడుతుంటుంది సారా పసిపిల్లల ఊయలలు ఊగుతున్నట్టు పిల్లలు ఏడుస్తున్నట్టు అనుభవిస్తూ మానసిక ఆందోళనకు లోనవుతుంది.

ఒక రోజు సారా తన కొడుకుతో ఒక చేదు నిజాన్ని వెల్లడిస్తుంది ఆవేశంలో వచ్చిన కోపంతో బిబిన్ తన తల్లిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోతాడు. తీవ్ర గాయాలతో ఉన్న సారాను హాస్పిటల్‌లో చేరుస్తారు ఆసుపత్రిలో ఆమె చివరి కోరిక మేరకు అడ్వకేట్ రాజన్ పోలీస్ ఆఫీసర్ నవాజ్ ను పిలుస్తారు వారికి సారా రెండు సీల్డ్ కవర్లు ఇస్తుంది అందులో ఒకటి మేజిస్ట్రేట్ కు ఇవ్వాలని చెబుతుంది రాజన్ కవర్‌ను మేజిస్ట్రేట్‌కు అప్పగించడంతో మేజిస్ట్రేట్ ఆ లేఖను చదివి షాక్ అవుతాడు సీఐ నవాజ్ ఎస్పీ అనిల్ దాస్ తో కలిసి మేజిస్ట్రేట్ ఆ కవర్లో ఉన్న విషయాలు నిజమేనని నిర్ధారిస్తారు ఆ లేఖలో ఏముందో కచ్చితంగా బయటకు రాకూడదని నిర్ణయిస్తారు ఆ సమయంలో సినీ నటి యాన్సీ హత్య జరగడం వల్ల సీన్ మారుతుంది ఆ కేసు ఛేదనలో ఉన్న అజీ కురియన్ అనే పోలీస్ ఆఫీసర్ ఆ విచారణలో బిబిన్ పేరు తెరపైకి వస్తుంది మేజిస్ట్రేట్ అజీని పిలిపించి సారా కేసు విషయం ప్రస్తావిస్తాడు గతం లోన జరిగిన ఈ సంఘటనతో 1000 మంది ప్రాణాలకు ప్రమాదం ఉందని వెంటనే బిబిన్ ను పట్టుకోవాలని చెబుతాడు.

సారా అసలు బీచ్ హాస్పిటల్ లో హెడ్ నర్సుగా పనిచేసే వ్యక్తి ఆమెకు సంతానం లేకపోవడం వల్ల ఆమెలో తీవ్ర ఆవేదన ఉత్పన్నమవుతుంది ఆ కారణంగా ఆమె మనసు శాడిస్టిక్ ధోరణిని కలిగిస్తుంది హాస్పిటల్ లో ఆడ శిశువులు పుట్టినప్పుడు మగ శిశువులతో మార్చి మగ శిశువులు పుట్టినప్పుడు ఆడ శిశువులతో మార్చేసే పని చేయడం ప్రారంభిస్తుంది ఇలా ఆమె 1000 మంది పిల్లలను తారుమారుచేసి వాటి వివరాలను తన గోడలపై రాసుకుంటుంది సారా తన కొడుకు బిబిన్ కూడా ఒక మార్పిడి శిశువే తాను అసలైన తల్లికి దూరమై, సారాతోనే ఉండిపోవడం వల్ల తన నిజమైన తల్లితో కలవకుండా చేసిన సారా పై ఆవేశంతో బిబిన్ ఆమెను చంపుతాడు తన తల్లిని చంపిన తర్వాత బిబిన్ ఆమె రాసిన డైరీలతో పారిపోతాడు.

మొత్తం కథలో కీలకమైన మలుపులు ట్విస్టులు అసంతృప్తి కలిగించగా పాత్రలు సరైన బలం లేకుండా ఉంటాయి దృశ్య నైపుణ్యం సంగీతం ఫోటోగ్రఫీ పరంగా మంచి ప్రయత్నం అయినా కథనం మరింత చురుకుగా సాగి ఉంటే బాగుండేదని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ு. 住?. Am tag nach solingen : nein, vor der nürnberger lorenzkirche gab es keine is-demo ⁄ dirk bachhausen.