భారత క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్‌లో నూతన చరిత్ర సృష్టించింది 2024లో టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా టీమిండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ ఘనతను బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో శుక్రవారం సాధించింది 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టూ ఈ ఫీట్ సాధించకపోవడం గమనార్హం ఇందుకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది 2022లో ఇంగ్లండ్ జట్టు మొత్తం 89 సిక్సర్లు కొట్టింది అయితే 2024లో టీమిండియా జట్టు ఈ రికార్డును అధిగమిస్తూ 100 సిక్సర్ల మైలురాయిని దాటింది టీమిండియా బ్యాటర్లు యువ సంచలన యశస్వి జైస్వాల్ 29 సిక్సర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా శుభ్‌మన్ గిల్ 16 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో ఉన్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తిరుగులేని పోరాటాన్ని కనబర్చింది విరాట్ కోహ్లీ (70) రోహిత్ శర్మ (52) సర్ఫరాజ్ ఖాన్ (70 నాటౌట్) లు అర్ధ శతకాలు సాధించి జట్టును ముందుకు నడిపించారు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 231/3 పరుగుల స్కోర్ వద్ద నిలిచింది తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగుల భారీ స్కోరు సాధించింది రచిన్ రవీంద్ర 134 పరుగులు చేయగా టిమ్ సౌథీ 63 పరుగులతో సహాయమందించారు ఎనిమిదో వికెట్‌కి ఇద్దరూ 134 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో న్యూజిలాండ్ 356 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ప్రస్తుతం భారత్ 125 పరుగుల వెనుకబడి ఉంది రోహిత్ శర్మ సేన ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మిగిలిన బ్యాటర్లు పట్టు సాధించాల్సిన అవసరం ఉంది ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్‌కు మరో అద్భుత ప్రదర్శన అవసరం ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా సిక్సర్ల కొత్త రికార్డుతో పాటు పునరుజ్జీవంతో వచ్చిన ప్రతిఘటన మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.