పనీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Paneer

పెద్ద, చిన్న వయసు భేదం లేకుండా అందరికి ఇష్టమైన ఆహారాల్లో పనీర్ ఒకటి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

పనీర్ వల్ల మన శరీరానికి చాల ఉపయోగాలు ఉంటాయి

  1. వెన్న తీయని పాలతో తయారైన పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 80 శాతం ప్రోటీన్లు ఉంటాయి. క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిన్నారుల ఆహారంలో పనీర్ చేరిస్తే, వారి ఎముకల ఎదుగుదల మరియు దంతాల ఆరోగ్యానికి ఇది దోహదం చేస్తుంది.
  2. పనీర్‌లో ఉన్న ఫాస్ఫరస్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజువారీ ఆహారంలో పనీర్‌ను చేర్చడం వలన అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించవచ్చు.
  3. పనీర్‌లో పుష్కలంగా ఉన్న ఫోలేట్ శరీరానికి విటమిన్‌-B అందిస్తుంది. ఇది గర్భిణీలకు అవసరమైన శక్తిని అందించడంతో పాటు, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. ఎర్రరక్తకణాల స్థాయిని పెంచడంలో ఫోలేట్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  4. పనీర్‌లోని మెగ్నీషియం మధుమేహాన్ని కట్టడి చేస్తుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, వ్యాధికారక కణాలను దూరం చేస్తుంది. ప్రోటీన్లు రక్తంలో చక్కెర విడుదలను నియంత్రించడంలో సహాయపడతాయి.
  5. పనీర్‌ను ఆహారంలో చేర్చడం వలన త్వరగా ఆకలి వేయదు. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తాయి, ఈ విధంగా అధిక బరువుకు దూరంగా ఉండొచ్చు.

పనీర్ ని మన ఇంట్లో పాలు మరియు వెనిగర్ ని ఉపయోగించి సులభంగా తాయారు చేసుకోవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

?ெ?. ?推薦分享. Spd im rat findet klare worte zur weinwoche und em-fanmeile ⁄ dirk bachhausen.