హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అశోకనగర్ పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.
మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.