న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం మరో కీలక మందుడుగు వేసింది. మరి కొద్దిరోజుల్లో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌ల వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ యాప్ బీటా వర్షన్ ను పరీక్షించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై అన్ని బెంచ్‌ల వాదనలతో పాటు తీర్పులను కూడా ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ లోని బీటా వర్షన్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించినట్లు సుప్రీం కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అన్ని బెంచ్‌లలో జరగబోయే లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన చిత్రాలకు కూడా విడుదల చేసింది. అలాగే కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లోటు పాట్లను సవరించి, లైవ్ స్ట్రీమింగ్ ను త్వరలోనే అధికారికంగా అమలులోకి తీసుకురానున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్‌లలో జరిగే వాదనలు, తీర్పులను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కాగా రాజ్యాంగ ధర్మాసనం వాదనలు, తీర్పులను 2022 నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.