తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగ..ఇటు నిరుద్యోగులకు సైతం వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తుంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేయడం, పరీక్షలు నిర్వహించడం , విజేతలకు పోస్టింగ్ లు ఇవ్వడం చేసింది. ఇక ఇప్పుడు వైద్య పోస్టుల భర్తీకి కసరత్తులు చేస్తుంది.
రాష్ట్రంలో 1,690 వైద్య పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉన్న నేపథ్యంలో 1,690 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. వీటికి నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి, 2025 మార్చి/ ఏప్రిల్లో భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటివరకూ కాంట్రాక్టు వైద్యుల నియామకం కోసం ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.