నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం (డొక్కా సీతమ్మ బడి భోజనం)లో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు రావడం తోప్రభుత్వం అప్రమత్తమైంది. క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేర్చబోతున్నారు.
డొక్కా సీతమ్మ బడి భోజనం మెనూ ఇలా…
సోమవారం: ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్ పలావు, కోడి గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ
మంగళవారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
బుధవారం: వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరు శనగ చిక్కీ
గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్ / నిమ్మకాయ పులిహోర (టెమన్ రైస్), -టొ-మాటో పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, వేరుశనగ చిక్కీ
శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు. స్వీట్
పొంగల్