మరోసారి ముగ్గురు అగ్ర నేతలు కలువడం..ఒకే ఫ్రేమ్ లో ఉండడం అభిమానుల్లో , పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోడీ , ఏపీ సీఎం చంద్రబాబు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురి కలయిక గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ , మోడీ సంభాషణ , వీడియోస్ , ఫొటోస్ ఎంతగా వైరల్ గా మారాయో తెలియంది. కాదు ఇప్పుడు మరోసారి ఈ ముగ్గురు కలిశారు.
హరియాణాలోని చండీగఢ్ నిన్న గురువారం జరిగిన NDA నేతల సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్లు ఒకే ఫ్రేమ్ల ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్లో పవన్ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జే.పి. నడ్డా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోడ్ సావంత్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజ్యాంగం యొక్క ‘అమృత మహోత్సవం’ మరియు 1975లో ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితి గురించి 50వ వార్షికోత్సవం పై కూడా దృష్టి సారించారు.