తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!

Telangana cabinet meeting has been finalized..!

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ జరుగనుంది. హైడ్రాకు చట్టబద్ధత, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. హైడ్రా కు ఫుల్ పవర్స్ వచ్చాయి. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నించేవారికి ఆర్డినెన్స్ తో చెక్ పెట్టారు.

జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ కొనసాగింపుగా జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం హైడ్రాకు అధికారాలను బదాలయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్, హైడ్రా పరిధిలో మున్సిపల్ చట్టం ప్రకారం ప్రభుత్వం అధికారాలను బదాలయించింది. దీంతో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు, రోడ్లు, పార్కలు, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయి. ఫలితంగా ఇక నుంచి నోటీసులు జారీ చేయడం, మౌఖిక ఆదేశాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చేయడానికి, సీజ్ చేయడానికి హైడ్రాకు పూర్తి అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *