India Vs New Zealand: భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ షురూ.. టాస్ గెలిచిన టీమిండియా

India Vs New Zealand

బెంగళూరులో భారత క్రికెట్ జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట పూర్తిగా రద్దయినప్పటికీ, రెండోరోజు (గురువారం) వాతావరణం అనుకూలించడంతో ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు, అయితే ఆ నిర్ణయం పిచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తీసుకున్నట్లు తెలిపారు.

భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్) ,యశస్వి జైస్వాల్ ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్, ఖాన్ రిషబ్ పంత్ (వికెట్ కీపర్) ,రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ ,కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,

న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్) డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే,
రోహిత్ శర్మ టాస్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ మొదట బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమైన నిర్ణయం పిచ్ కవర్స్ కింద ఉండడంతో ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ ఈ పిచ్ స్వభావాన్ని బట్టి మంచి స్కోరు చేయగలిగితే విజయం సాధించే అవకాశం ఉంది అని తెలిపారువిశ్వాసంతో కూడిన రోహిత్ వారి జట్టు ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో మెరుగ్గా ఆడిందని ఈ మ్యాచ్‌లో కూడా విజయవంతంగా ఆడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు అలాగే జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శుభ్‌మాన్ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చాడు గిల్ మెడ నొప్పి కారణంగా మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో ఈ మార్పు జరిగింది అలాగే పేసర్ ఆకాశ్ స్థానంలో స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి తీసుకున్నారు ఈ మ్యాచ్ దశాబ్దకాలపు ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగం కావడంతో రెండు జట్లు కూడా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. భారత జట్టు బ్యాటింగ్ లోతు మరియు న్యూజిలాండ్ బౌలింగ్ దూకుడు ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *