Allu Arjun: అల్లు అర్జున్‌ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

allu arjun fan

సినిమా తారలకి అభిమానులు ఉండటం సహజం అయితే కొంతమంది అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి విభిన్నంగా ప్రదర్శిస్తూ తమ ప్రియమైన హీరోలపై తన ప్రేమను చూపిస్తారు అలాంటి సంఘటన తాజాగా పుష్ప ఫేమ్ అల్లు అర్జున్‌తో చోటుచేసుకుందిఅల్లు అర్జున్‌ పుష్ప చిత్రంతో తగ్గేదే లే అని దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు ఈ సినిమాతో అతని అభిమానుల్లో విపరీతమైన పెరుగుదల కనిపించింది అందులో ఓ అభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌ పై ప్రయాణించి తన ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేశాడు

ఈ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ నుండి ఐకాన్ స్టార్‌ను కలవడం కోసం సైకిల్ పై ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాడు తన అభిమాన హీరోని కలిసిన తరువాత ఈ సూపర్ ఫ్యాన్‌తో అల్లు అర్జున్ కొద్దిసేపు ముచ్చటించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో అల్లు అర్జున్ తన అభిమానిని కలవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కనిపిస్తాడు.

తన అభిమాన హీరోని కలవడం పట్ల ఆనందంలో తేలిన ఆ అభిమాని ఇది తన జీవితంలో మరచిపోలేని అనుభవం అని పేర్కొన్నాడు అంతేకాకుండా తన సైక్లింగ్ ప్రారంభించే ముందు హనుమాన్ చాలిసాను ఎన్నోసార్లు పఠించానని తెలిపాడు ఇకపోతే అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“all mу dесіѕіоnѕ аrе well thоught оut, wеll rеѕеаrсhеd аnd іn my оріnіоn, thе bеѕt оn bеhаlf оf our county. Latest sport news. 用規?.