dashara vijayan

Dushara Vijayan: దుషారా విజయన్ కి పెరుగుతున్న క్రేజ్

తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల అత్యంత చర్చనీయమైన పేరు దుషారా విజయన్ రాయన్ మరియు వేట్టయన్ సినిమాల విడుదలతో ఆమె పేరు తమిళనాడులో అన్ని వర్గాల ప్రేక్షకులకు పరిచయమైంది. దుషారా దుండిగల్ ప్రాంతానికి చెందిన ఈ నటి 2019లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటినుంచి ఆమె తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ తన ఖ్యాతిని నిత్యం పెంచుకుంటూ వెళుతోంది దుషారాను ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి యువతి పాత్రలలో ప్రేక్షకులు ఇట్టే గుర్తుంచుకుంటారు ఆమె నటన ఆడియన్స్‌కి వెంటనే కనెక్ట్ అవుతుందని నిరూపించిన చిత్రం రాయన్ ఇందులో ధనుశ్ చెల్లెలుగా ఆమె చేసిన పాత్ర సహజంగా ప్రాణం పోసినంతగా కనిపించింది ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది దీనితో ఆమె పేరు తెరపై మాత్రమే కాదు ప్రేక్షకుల ఇంట్లోనూ మార్మోగింది.

ఈ విజయంతో దుషారాకు వేట్టయన్ లో అవకాశం వచ్చింది ఇందులో ఆమె సాధారణ స్కూల్ టీచర్‌గా నటించింది. ఈ పాత్రలో దుషారా అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడే కీలక పాత్ర పోషించింది కథ మొత్తం ఈ పాత్ర చుట్టూ తిరుగుతుండటంతో ఆమె ప్రతిభకు ప్రేక్షకుల నుండి విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ రెండు చిత్రాల విజయాల కారణంగా దుషారాకు కోలీవుడ్‌లో భారీ డిమాండ్ పెరిగిపోయింది.ప్రస్తుతం ఆమె విక్రమ్ నటించిన వీర ధీర శూరన్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లలో భాగమవుతూ తన నటనా రంగంలో మరింత ముందుకు సాగుతున్నారు. దుషారా విజయన్‌కి ఉన్న ఈ దూకుడు చూస్తుంటే ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో త్వరలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందాలని ఆశించవచ్చు.

Related Posts
చాందినీ చౌదరి “సంతాన ప్రాప్తిరస్తు
Chandini Chowdary e1709565818868 V jpg 442x260 4g

చాందినీ చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు ఇందులో విక్రాంత్ కథానాయకుడిగా కనిపిస్తున్నారు ఈరోజు చాందినీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన Read more

మీనాక్షి చౌదరి తో సుశాంత్ ఎంగేజ్మెంట్ నిజమేనా?
Sushanth

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో చేసిన Read more

అప్పుడే ఇంటర్నేషనల్ డిస్కషన్స్ ఆ.!
ssmb 29

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ Read more

MAD:మ్యాడ్ స్క్వేర్ ట్రైల‌ర్ విడుదల
MAD:మ్యాడ్ స్క్వేర్ ట్రైల‌ర్ విడుదల

2023లో విడుదలై ఘనవిజయం సాధించిన వినోదాత్మక చిత్రం 'మ్యాడ్' కి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల Read more